01-12-2025 11:31:28 AM
క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభలో ప్రధాని మోదీ(PM Modi speech) మాట్లాడుతూ... క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అన్నారు. మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు అందరూ కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. సీపీ రాధాకృష్ణన్(C. P. Radhakrishnan) రాజ్యసభ ఛైర్మన్ గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ గా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని ప్రధాని తెలిపారు. గవర్నర్ గా రాధాకృష్ణన్ పలు రాష్ట్రాల్లో సేవలు అందించారని మోదీ గుర్తుచేశారు. రాధాకృష్ణన్ పార్టీ కార్యకర్త నుంచి చూస్తున్నా అని మోదీ తెలిపారు. రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం అన్నారు. పేదలు, బడుగువర్గాలు జీవితాలు మెరుగుపడేలా సభలో చర్చలు జరగాలని ప్రధాని సూచించారు. కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల ఘటనలో రాధాకృష్ణన్ త్రుటిలో బయటపడ్డారని ప్రధాని పేర్కొన్నారు.