calender_icon.png 1 December, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన

01-12-2025 09:17:07 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నారాయణపేట-మక్తల్-కొడంగల్(Narayanpet-Makthal-Kodangal) ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆత్మకూరులో 50 పడకల సీహెచ్సీను రేవంత్ రెడ్డి  ప్రారంభించనున్నారు. మక్తల్, ఆత్మకూరు పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.