calender_icon.png 1 December, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైరల్ ఫోటో: సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్

01-12-2025 11:56:52 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ జట్టుతో రేవంత్ రెడ్డి బృందం ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనుంది. గోట్ టూర్ లో భాగంగా ఈనెల 13 హైదరాబాద్‌కు వస్తున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో  సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ లో తలపడనున్నారు. దీని కోసం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఆదివారం రాత్రి సీఎం తన టీమ్ తో కలిసి ఫుట్ బాట్ ప్రాక్టీస్ చేశారు. మెస్సీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే థీమ్ తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ఫుట్ బాల్ సంబంధిత కార్యాక్రమాల్లో పాల్గొని, పలువురు ప్రముఖులతో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు. రేవంత్ తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన ఫుట్‌బాల్ జెర్సీలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి ఆర్సెనల్ జట్టు జెర్సీలో కనిపిస్తున్నారు.