19-11-2025 07:38:40 AM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బుధవారం ఏపీకి రానున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయిబాబా(Sathya Sai Baba) శతజయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 9.30కి సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి ప్రధాని చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రధాని మోదీ నివాళర్పించనున్నారు. రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.