calender_icon.png 19 November, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పట్నం’లో ట్రాఫిక్ ఇక్కట్లు

19-11-2025 01:08:27 AM

  1. ఇష్టానుసారంగా వాహనాలు రయ్ రయ్ రోడ్లపై పార్కింగ్ చేస్తున్న వాహనాలు
  2. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ వీకెండ్ లో పరిస్థితి మరింత దారుణం
  3. ట్రాఫిక్ సిగ్నల్ లేక నిత్యం అవస్థలు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ సమస్యల తో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. సాగర్ రహదారిపై ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో వాహనదారులు తమ ఇష్టానుసారంగా అపసవ్య (వ్యతిరేక) దిశలో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ సమస్యలు  తలేత్తేలా చేస్తున్నారు.  ప్రాధానంగా ఇబ్రహీంపట్నంతో పాటు మంగళ్ పల్లి, బొంగ్లూర్, తుర్కయంజాల్ చౌరస్తాలలో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సెలవు దినములు మినహా మిగతా రోజుల్లో ఈ ప్రాంతం లో పలు విద్య సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి... దీంతో ఆ విద్య సంస్థల కు చెందిన పలు బస్సుల కు తోడు నిత్యం ఇదే రహదారి నుండే సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారి కావడం తో ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

దీంతో ప్రతీ నిత్యం ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీగా మారడంతో  ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ప్రధాన రహదారుల పై  ట్రాఫిక్  సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తేనే సమస్య కు తీరుతుంది. ఆ దిశ గా అధికారులు చర్యలు తీసుకోవాలి.

పరిష్కారం దిశగా కృషి చేయాలి

ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ఇక్కడ పలు ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఉండడంతో నియోజకవర్గం లో ని పలు గ్రామల నుంచి నిత్యం ప్రజలు, విద్యార్థులకు సంబంధించిన వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పట్నం లో ప్రధాన రహదారులకు ఇరువైపుల ఆక్రమణలు పెరిగాయి. 

రోడ్డుపై వెళ్లే వాహనాలను చాలా వరకు రోడ్లకు ఇరువైపులా రోడ్డుపైనే  ఎక్కడ పడితే అక్కడే నిలపడంతో ట్రాఫిక్తో ఇబ్బందులు తప్పడంలేదు. పార్కింగ్ సౌకర్యం, సెట్ బ్యాక్ లేని కమర్షియల్ షాప్ లు ఇక్కడ ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నాయి. 

హార్ట్ పేషంట్స్, పిల్లలకు ప్రమాదమే

బుల్లెట్ బైకుల మోతతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు బస్టాండ్, పబ్లిక్ ఎక్కువగా ఉన్నచోట, ముఖ్యంగా బాలికలు ఉన్న చోట అధిక శబ్దం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బుల్లెట్ బైక్ ల నుండి టప్..టప్ అంటూ వచ్చే ఈ అధిక శబ్ద కాలుష్యం పసిపిల్లలకు, హార్ట్ పేషంట్స్, వృద్ధులు, రోగులు తదితర వయోవర్గాలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో మరికొందరు వీరవిహారం చేస్తున్నారు. బైకర్లు ప్రజల నిద్రకు భంగం కలిగిస్తున్నారని, కావున దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిఘ పెంచాలని పలువురు కోరుతున్నారు.

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ప్రస్తుతం, ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా చర్యలు తుసుకుంటున్నాము. ట్రాఫిక్ రద్దీ గా ఉన్న దగ్గర తమ సిబ్బంది తో  ఉ  సమస్యను నియంత్రిస్తున్నాం. ప్రధాన కూడలల్లో ట్రాఫిక్ సిగ్నల్స్  ఏర్పాటు కు చర్యలు తీసుకుంటాం. వాహనాదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధన లు పాటించాలి.  కార్లకు బ్లాక్ ఫిలిం వేసిన కార్లు కానీ, ఇతర వాహనాలు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. కారులో సీటు బెల్టు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, క్షేమంగా వారివారి గమ్యాలను చేరుకోవాలి.

- జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ,  ఇబ్రహీంపట్నం