20 April, 2026 | 3:27 AM

టీఎంసీ గూండాలూ.. తస్మాత్ జాగ్రత్త

20-04-2026 01:34 AM

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ హెచ్చరికలు

కోల్‌కతా, ఏప్రిల్ 19: ‘బెంగాల్‌లో అరాచకాలు సృష్టిస్తున్న టీఎంసీ గూండాలకు ఇదే మా హెచ్చరిక. ‘సిండికేటు’గాళ్లు, లంచావతారాలందరూ ఈ నెల ౨౯లోపు మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లోల సరెండర్ కండి. లేదంటే.. మే ౪ నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏ ఒక్కర్నీ వదిలి పెట్టం’అంటూ ప్రధాని మోదీ హెచ్చరించా రు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బిష్ణుపూర్‌లో నిర్వహించిన బీజే పీ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

బిష్ణుపూర్‌లో టీఎంసీ మాఫియా, సిండికేట్ ఆగడా లు పెచ్చుమీరాయని, ఇక మీదట వారి ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘మాతాశక్తి భరోసా కార్డ్’ అమలు చేసి, ప్రతి మహిళకు కేటా 36,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు ఉచిత రేషన్ అందించడంతో పాటు పీఎం ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్ల నిర్మాణానికి 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. పొరుగున ఉన్న అసోం, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉత్తమ పాలన అందిస్తున్నదని, కానీ.. బెంగాల్‌లో టీఎంసీ పాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు.