20 April, 2026 | 3:27 AM

నేడు శాంతి చర్చలు?

20-04-2026 01:36 AM

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ బృందాల భేటీ  

మరోసారి పాక్ మధ్యవర్తిత్వం

హోర్ముజ్, అణుపరీక్షలపై ఇరాన్ పట్టుదల

ఎల్లుండితో ముగియనున్న సీజ్‌ఫైర్ గడువు

ఈ నేపథ్యంలో చర్చలకు ప్రాధాన్యం

వాషింగ్టన్, ఏప్రిల్ 19: అమెరికా ఇరా న్ మధ్య రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజ ధాని ఇస్లామాబాద్ వేదికగా రెండోసారి అమెరికా ఇరాన్ మధ్య శాంతిచర్చలు జరుగనున్నాయి. పాక్ మధ్యవర్తిత్వంతో జరుగ నున్న ఈ భేటీకి సోమవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ చేరుకోనుంది. బృందంలో దేశాధ్య క్షుడు ట్రంప్ సలహాదారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి.

గతవారం జరిగిన మొద టి విడత చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పాక్ రెండో విడత చర్చలకు ప్రతిపాదించింది. అందుకు అమెరికా, ఇరా న్ అంగీకరించడంతో చర్చలకు మార్గం సుగమమైంది. చర్చల నేపథ్యంలో ఇస్లామా బాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో దౌత్య ప్రాంతానికి వెళ్లే రహదారులను మూసివేసి సైన్యం పహారా కాస్తోంది. మొత్తం ౧౦ వేలమంది పోలీసులు నగరాన్ని మోహరించారు.

శాంతిచర్చలు జరిగే హోటల్‌లోని అతిథులను ఖాళీ చేయించడమే కాకుండా, పాక్ ప్రభు త్వం మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి రవాణా రుసు ము (ట్రాన్సిట్ ఫీజు) వసూలు, అణు పరీక్షల విషయంలో ఇరాన్ ఎంతో పట్టింపుగా ఉంది. ఈ అంశాలపై అమెరికా కూడా పట్టువీడేటట్లు కనిపించడం లేదు. దీంతో ఆ రోజు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

చర్చలకు ఇరాన్ నో!

పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన రెండో విడత చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ ఆదివారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతాయని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఏప్రిల్ 22తో కాల్పుల విరమణ గడువు ముగియనుండటంతో ఈ పరిణా మం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అనుసరిస్తున్న తీరు వల్లే తాము చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ పేర్కొంది. వాషింగ్టన్ తన వైఖరిని మాటిమాటికీ మారుస్తోందని, ఇరాన్ ముందు అసాధ్యమైన డిమాండ్లు ఉంచుతున్నదని విమర్శించింది.