calender_icon.png 24 October, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగొచ్చిన బంగారం ధర

23-10-2025 01:18:37 AM

-ఒక్క రోజే రూ.9వేలు, సిల్వర్‌పై రూ.13 వేల వరకు తగ్గుదల

-హైదరాబాద్‌లో10 గ్రాముల పసిడి ధర 1,25,250

న్యూఢిల్లీ, అక్టోబర్ 22 : ఇటీవల  సరికొత్త రికార్డులు సృష్టిస్తూ పెరిగిన బంగారం ధర బుధవారం దిగొచ్చింది. దీపావళికి ముందు నుంచి ధగధగ మండుతూ ఆకాశానంటిన పసిడి ధర ఒక్కరోజే తులంపై రూ.9 వేల వరకు తగ్గింది. బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,250కి పడిపోయింది.22క్యారెట్ల ధర రూ.1,14,843 ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.13వేల వరకు తగ్గింది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు 28 వేలకు పైగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,022 డాలర్లకు తగ్గింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది. నేడు కేజీ వెండి ధర 1,58,000 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో రూ.28 వేలు తగ్గింది. ఇటీవల రికార్డుస్థాయిలో గరిష్టాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగ డం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని  మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం, వెండి ధరలు దిగిరావడంతో సామాన్యులు సం తోష పడుతున్నారు.