4 April, 2026 | 3:11 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

రేపు కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభించనున్న ప్రధాని

05-04-2025 11:23 PM

డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసిన రైల్వే శాఖ..

చెన్నై: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం వద్ద సముద్రంలో నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. కాగా రైల్వే శాఖ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణ విశేషాలను డ్యాక్యుమెంటరీగా రూపొందించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. మొదట వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్‌ను ఓపెన్ చేయనున్న మోదీ ఆ తర్వాత రామేశ్వరం మధ్య నడిచే కొత్త రైలును ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ నుంచి వెళ్లే కోస్టు గార్డు షిప్‌కు కూడా ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో 8300 కోట్ల ఖరీదైన వేర్వేరు రైల్వే, రోడ్డు పనులను ఆయన దేశానికి అంకితం చేస్తారు.