6 August, 2026 | 1:25 AM

తోటపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

06-08-2026 12:08 AM
  1. గ్రామదేవతకు మహిళల మొక్కులు
  2. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం
  3. బంక లక్ష్మి తోటపల్లి గ్రామ సర్పంచ్

హుస్నాబాద్ ఆగస్టు 5  (విజయక్రాంతి) :  హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బంక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తలపై మోసుకుని ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని గ్రామదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామంలో సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంక లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గ్రామస్థులందరూ ఐకమత్యంతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామదేవత పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు గ్రామంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం  అధ్యక్షులు బంక చందు. అధ్యక్షులు బోనాల కుమార్. ఉపాధ్యక్షులు బంక రాజ్ కుమార్ .శాతవేణి చందు. పోసవేణి ఎల్లయ్య . కార్యవర్గ సభ్యులు.పోసవేణి సంపత్ గెంటే అనిల్ . బంక కనకయ్య శాతవేణి శ్రీకాంత్ గ్రామ పెద్దలు, యాదవ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.