6 August, 2026 | 2:32 AM

రేగా కాంతారావుపై చర్యలు తీసుకోవాలి

06-08-2026 01:24 AM

అశ్వాపురం, ఆగస్టు 5 (విజయక్రాంతి): పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఆయనను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం ఉంటే బీఆర్‌ఎస్ అధిష్ఠానం తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిని సమర్థించడం సరికాదని, కేసుపై సత్వర విచారణ జరిపి బాధిత మహిళకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో మండల వ్యాప్తంగా మహిళలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాదె కేశవరెడ్డి, ఉసా అనిల్ కుమార్, బూరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేములపల్లి రమేష్, కుంజా జాను, కోర్సా కృష్ణ, లంకమల్ల కొండలరావు, బట్టా సత్యనారాయణ, కాకా రాములు,  తదితరులు పాల్గొన్నారు.