19-10-2025 12:34:49 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 18 (విజయక్రాంతి): యూట్యూబ్ వ్యూస్, డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు కంటెంట్ క్రియేటర్లు నైతిక విలువలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా, ఇద్దరు మైనర్లతో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించి, తమ యూట్యూబ్ చాన ళ్లలో ప్రసారం చేసిన నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై రెండు యూ ట్యూబ్ చానళ్లపై పోక్సో చట్టం కింద కేసు న మోదు చేశారు. చిన్నారులను ఉపయోగించి అభ్యంతరకర రీతిలో వీడియోలు చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత యూట్యూబ్ చానళ్లపై పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ పేరుతో హద్దు మీరొద్దు: వీసీ సజ్జనార్
సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెం ట్ అయినా చేస్తామంటే కుదరదని, చట్టప్రకారం బాధ్యులపై పోలీస్ శాఖ కఠిన చర్యలను తీసుకుంటుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తన పోస్టులో స్పష్టం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో చట్టాన్ని, నైతిక విలువలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తల్లిదం డ్రులు కూడా తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని, అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.