19-10-2025 12:32:49 AM
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మరో రెండు కొత్త డిగ్రీ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ఒకటి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మరోకటి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా నారాయణపేట జిల్లా ధన్వాడలోని డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి రూ.6.10 కోట్లు నిధులు మంజూరు చేస్తూ మరో జీవో విడుదల చేసింది.