12-02-2026 06:32:29 PM
ఆర్ట్స్ కళాశాల, ఓ.యు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి ప్రాంతీయ అస్తిత్వాన్ని జోడించిన కవి సిధారెడ్డి అని ఆర్ట్స్ కళాశాల, ఓ.యు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల-మహేంద్ర హిల్స్, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో "డాక్టర్ నందిని సిధారెడ్డి సాహితీ సమాలోచన" అంతర్జాతీయ సదస్సు ఘట్ కేసర్ సర్కిల్ అంకుషాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ లో జరుగుతుంది.
ప్రారంభ సభ గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు మహేంద్ర హిల్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్నేహలత అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల, ఓ.యు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ తాను సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివానని, నేడు నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణం గురుకులం అన్నారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి ప్రాంతీయ అస్తిత్వాన్ని జోడించిన కవి సిధారెడ్డి అని ఖాసీం పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ సిధారెడ్డి సాహిత్యము నేటి తరానికి అవసరం అన్నారు.
మరొక విశిష్ట అతిథి ఐ.ఏ.ఎస్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ప్రసంగిస్తూ వారి కవిత్వం, వ్యక్తిత్వం ఒకటే అంటారు. వారు నిబద్ధతకు నిదర్శనం అన్నారు. వారు సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా 120 పుస్తకాలు ఆవిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు సంచాలకులు మహేంద్ర హిల్స్ గురుకుల కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీ భాష్యం అనురాధఈ సదస్సులో డిగ్రీ కళాశాలల డిసిఓ డాక్టర్ సునీత, డాక్టర్ జయప్రకాష్ సంపాదకులు, తెలుగు భాష చైతన్య సమితి. ప్రధాన కార్యదర్శి ఎడ్ల కల్లేష్, కార్యదర్శి ఎల్ జగన్ పూర్తి సహకారాన్ని అందించారు. కళాశాల అధ్యాపక బృందం, పత్ర సమర్పకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.