17 June, 2026 | 12:19 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

సుల్తానాబాద్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

12-02-2026 06:35 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి ని ఎమ్మెల్యే విజయ రమణారావు  గురువారం  ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో పార్టీ అభ్యర్థులు, నాయకుల తో కలిసి సమీక్షించారు. శుక్రవారం జరిగే కౌంటింగ్ సందర్భంగా తీసుకునే జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే  కార్యకర్తలకు పలు కీలక, సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ... మున్సిపల్ లోని 15 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని పేర్కొన్నారు.

దాదాపు 20 రోజులుగా పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇన్చార్జులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లోనూ సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరింతగా ప్రజల మన్నలను పొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, ఓదెల ఆలయ చైర్మన్ చికట్ల మోండన్న, ఉట్ల వర ప్రసాద్, సాయిరి మహేందర్, డాక్టర్ అయిల రమేష్ వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, కౌన్సిలర్ అభ్యర్థులు, సర్పంచ్ లు,ఎన్నికల ఇంచార్జులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. ..