12-02-2026 06:28:46 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం డీఈ, ఏఈఓలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ నాణ్యతతో పాటు లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం కల్పిస్తున్న గృహ సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.