calender_icon.png 16 May, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట రాయుళ్ల అరెస్టు

16-05-2025 12:00:00 AM

అశ్వాపురం మే 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మం డలం లోని పాములపళ్లి గ్రామపంచాయతీలో గల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద పేకాట ఆడుతున్న పదిమందిపేకాటరాయిల్లను సీఐ జి అశోక్ అదుపులో కి తీసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం మిషన్ భగీరథ పంప్ హౌస్ దగ్గర పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించారు.

పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుంచి రూ 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలో పేకాట, కోడి పందాలు, పశువుల అక్రమ రవాణా లాంటి వాటిని సహించేది లేదని, ఎవరైనా సమాచారం అందించినట్లయితే వారి వివరాలను గోప్యం గా ఉంచుతామన్నారు.