చమేడ అడవుల్లో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
భద్రతా బలగాలకు తప్పిన ముప్పు
చర్ల , మే 15 (విజయ క్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రం లోని చమేడ అడవిలో పది కుక్కర్ బాంబులు, రేషన్ వస్తువులు స్వాధీనం భద్రత బలగాలు గురువా రం సాయంత్రం ధమ్తారిలోని చమేడ అడవిలో మావోయిస్టుల కుట్ర భగ్నం చేశాయి, ఛత్తీస్గఢ్లోని ధమ్తారి జిల్లాలోని ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని చమేడ అడవిలో పోలీసులు మరియు డి ఆర్ జి బలగాలు ఐ ఈ డి మరియు ప్రెషర్ కుక్కర్ బాంబు లను వెలికి తీ యడంలో విజయాన్ని సాధించాయి.
మావోయిస్టులు దాచిపెట్టిన అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసు కోవడం ద్వారా భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది ,అడవిలో జరిపిన సోదాల్లో భద్రతా దళాలు పది ప్రెషర్ కుక్కర్లను, ఐ ఈ డి లను పెద్ద మొత్తంలో రేషన్ సామగ్రిని కనుగొన్నాయి. పోలీసు బలగాలకు హాని కలిగించే లక్ష్యంతో తయారు చేయడానికి ఈ కుక్కర్లను ఉపయోగించారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.






