15-05-2025 10:46:13 PM
వ్యక్తికి తీవ్ర గాయాలు..
కడ్తాల్: అతివేగంతో బైక్ ను ఢీకొన్న కారు వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్(Kadthal Police Station) పరిధిలోని గోవిందాయపల్లి తండా గేట్ సమీపంలో జాతీయ రహదారి 765పై అతివేగంతో హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వెళ్తున్న కారు టీఎస్ 11 ఈఎస్ 9541 గల కారు అతివేగంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వాహనం నడుపుతున్న వ్యక్తి పేరు కొండల్ రెడ్డి అని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన చీపునుంతలకు చెందిన చంద్రమౌళి బైక్ పై వెళ్లి పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్ళాడు. జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తుక్కుగూడ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.