సిటీ శివారు ప్రాంతాలకు పోలీసుల హెచ్చరిక
- నగరంలోకి కొత్త దోపిడీ గ్యాంగ్ ఎంటర్
గస్తీ పెంచిన పోలీసులు
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 13 : సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, గ్రామీణ ప్రాంతాల వారు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సిటీ శివారు ప్రాంతాల్లో కొత్త దోపిడీ గ్యాంగ్ దిగిందని, వీరి పట్ల అంద రూ అప్రమత్తంగా ఉండాలని కోరా రు. బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూని టీలోకి ప్రహారీ సోలార్ వైర్లను కట్ చేసి దొంగల ముఠా లోపలికి ప్రవేశించిందని, ఒక ఇంట్లో నగదు బంగారు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇది సాధా రణ దొంగలు చేసిన పని కాదని మధ్యప్రదేశ్‌కు చెందిన థార్ అనే భయంకరమైన దొంగల ముఠా పనేనని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ గ్యాంగ్ సిటీ శివారులో సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించా యన్నా రు. దీంతో సిటీ శివారులోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా రాత్రి పూట తలుపు తడితే ఎట్టి పరిస్థతుల్లోనూ తలుపులు తెరవొద్దన్నారు. అనుమా నాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో 8712662302, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో 87126 62301, ఎస్సై డీ కరుణాకర్ రెడ్డి 871266 2650, ఎస్సై డీ సునీల్ కుమార్ 871266 2293, ఎస్సై ఎల్ రమేశ్ నాయక్ 871266 2295 నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.






