26 June, 2026 | 10:40 PM

రామోజీరావుకు నివాళులు

14-06-2024 01:15 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 13 : ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, నాయకులు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, దెంది రాంరెడ్డి,  కమలాకర్ రెడ్డి  పాల్గొన్నారు.