గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
01-07-2024 01:31 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్ సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్ కు వెళ్లారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అటు పీపుల్స్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాల ర్యాలీని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. నీట్ పరీక్ష రద్దు చేయాలని, పేపర్ లీకేజీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.






