18 July, 2026 | 4:34 PM

కొత్త క్రిమినల్ చట్టాలపై అమిత్ షా ఏమన్నారంటే..?

01-07-2024 01:46 PM

న్యూఢిల్లీ: కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ అన్నారు. అమల్లోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాలపై అమిత్ షా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై లోక్ సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించామని తెలిపారు. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త న్యాయ చట్టాలు బాధితుల కేంద్రంగా తయారయ్యాయన్నారు. కొత్త న్యాయ చట్టాల వల్ల నేర విచారణ వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతోందన్నారు.

కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశామన్నారు. స్వాతంత్రం పొందిన సుమారు 77 సంవత్సరాల తరువాత, నేర న్యాయ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా 'స్వదేశీ' అని హైలైట్ చేస్తూ, జాతికి తన అభినందనలు తెలిపారు. 75 సంవత్సరాల తరువాత, వలసరాజ్యాల చట్టాల స్థానంలో భారత పార్లమెంటు రూపొందించిన కొత్త చట్టాలు జూలై 1 సోమవారం నుండి అమలులోకి వచ్చినట్లు ఆయన ఉద్ఘాటించారు.