మట్కా స్థావరంపై పోలీసులు దాడి
03-05-2024 12:39 AM
రూ. 32,500నగదు జప్తు
జహీరాబాద్, మే 2 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మట్కా స్థావరంపై బుధవారం రాత్రి జిల్లా టాస్క్‌పోర్సు పోలీసులు దాడు లు చేశారు. ఈ దాడుల్లో రూ. 32,500నగదు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు టాస్క్‌పోర్సు అధికారులు, సిబ్బంది పట్టణంలోని శ్రీరామ్ మహేళలో మట్కా నిర్వహిస్తున్న గుర్రం శ్రీనివాస్(48) ఇంటిపై దాడిచేశారు. అతని వద్ద నుంచి రూ. 32,500నగదు, మట్కా చిట్టీలతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వివిధ రకాల అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




