calender_icon.png 19 January, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

19-01-2026 07:51:28 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించిన పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. అర్రైవ్- అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా సోమవారం సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా, టూటౌన్ పరిధిలోని కుంకుమ్ మిల్లు చౌరస్తాల వద్ద వచ్చిపోయే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు, హెవీ వెహికల్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయినవారితో ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితులను వాహనదారులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, క్షేమంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  శంకర్ నారాయణ  అందరితో ప్రతిజ్ఞ చేయించారు.