14-01-2026 12:00:00 AM
మణుగూరు, జనవరి 13 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్స వాల సందర్భంగా ప్రజలలో అవగాహన పెంచేం దుకు సబ్ డివిజన్ పోలీస్ యం త్రాంగం నడుం బిగించింది. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పాటి నాగబాబు,ఎస్‌ఐ నాగేష్, పోలీసుల ఆ ధ్వర్యంలో పగిడేరు గ్రామంలో సర్పంచ్ కుం జా రాజా అధ్యక్షతన మంగళవారం అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా సిఐ నాగబాబు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్లు ధరించడం, వేగాన్ని తగ్గించడం, కుటుంబం కోసం బాధ్యతగా డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ము ఖ్యమైన అంశాలపై గ్రామ ప్రజలకు వివ రించారు. కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలు, యువకులచే రోడ్డు భద్రత గురిం చి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.