14-01-2026 12:00:00 AM
పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు
అశ్వాపురం, జనవరి 13 (విజయక్రాంతి): అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కలలుగా కాకుండా వాస్తవంగా మార్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవం కలిగించే కీలక కార్యక్రమమని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందే వరకు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.