11-09-2024 10:55:00 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో, రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా కోటి రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ అందించారు. విరాళం అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతం, ఇతర సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారీ వర్షాలతో విధ్వంసకర వరదలతో పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.