4 July, 2026 | 9:44 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మా భూమిలో ఇల్లు కడుతున్నడు

12-06-2024 12:35 AM

కాంగ్రెస్ నాయకుడు ఆక్రమించుకున్నడు

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తన భూమిని కబ్జాచేసి ఇల్లు నిర్మిస్తున్నారంటు ఆరోపిస్తూ ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌కు చెందిన నర్సమ్మ తన స్థలంలో కాంగ్రెస్ నాయకులు ఇల్లు నిర్మిస్తున్నారంటూ కొంత కాలం క్రితం నిజామాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముని సిపల్ అధికారులు ఆ ఇంటి నిర్మాణాన్ని ఆపేశారు. అయితే రాజకీయ పలుకుబడి వాడుకొని సదరు నేత మళ్లీ ఇంటి నిర్మాణం ప్రారంభించాడు.

నర్సమ్మ మాక్లూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మాక్లూర్ ఎస్సై సదరు నాయకుడిని పిలిచి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎస్సై సూచ నలతో ఇంటి నిర్మాణ పనులను ఆపినట్టే ఆపి, మరోసారి ప్రారంభించారు. ఎస్సై చెప్పినా నిర్మాణ పనులను కొనసాగించడంతో మనస్థాపం చెందిన నర్సమ్మ.. మంగళవారం జిల్లా పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు, వెంటనే నర్సమ్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నర్సమ్మ ఎక్కడుందో చెప్పేందుకు నిరాకరించారు. దాస్‌నగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, నర్సమ్మ భూమిలో అక్రమంగా జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులను తొలిగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.