17 April, 2026 | 8:58 AM

అక్రమంగా గోవులను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..

29-05-2025 11:05 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పోతురాజు పల్లి సమీపంలో అక్రమంగా గోవులను తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు చేరుకొని ఆవులను తరలిస్తున్న డీసీఎం ను పట్టుకొన్నారు, డీసీఎం లో పరిశీలించగా 35 నుండి 40 వరకు గోవులు ఉన్నాయి, డీసిఎం డ్రైవర్ ను ఆరా తీయగా గజ్వేల్ నుండి తీసుకురావడం జరిగిందని తెలిపినాడు. తక్షణమే తూప్రాన్ ఎస్ఐ శివానందం, పోలీస్ సిబ్బంది మాసాయిపేట మండలం రామంతపూర్ లో ఉన్న గోసంరక్షణ శాలకు వాటిని తరలించారు.