18 August, 2026 | 3:38 AM

రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ ల కార్యాలయాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

30-07-2025 10:37 PM

ఖమ్మం (విజయక్రాంతి): పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అధునీకరించిన సిటీ ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్‌పెక్టర్(ఆడ్మిన్, యంటివో) కార్యాలయాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) బుధవారం ప్రారంభించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం విధులు సజావుగా, సౌకర్యవంతంగా నిర్వహించేలా ఫర్నీచర్, తదితర ఏర్పాట్లు చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఏఆర్ ఏసిపిలు సుశీల్ సింగ్, నర్సయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగులమీరా పాల్గొన్నారు.