30-07-2025 10:39:50 PM
పెద్ద రింగ్ ను తగ్గించాలని డిమాండ్..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు మండల పరిధిలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన రింగ్ రోడ్ సర్కిల్ వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు బుధవారం ఒక ప్రకటన తెలిపారు. రోడ్ మద్యలో రింగ్ రోడ్ సర్కిల్ పెద్దదిగా ఉండటం వలన లారీలు బస్సులు భారీ వాహనాలు సర్కిల్ చుట్టూ క్రాస్ చేసే సమయంలో రింగ్ సర్కిల్ కి గుద్దుకోవడంతో సర్కిల్ పగిలిపోయి బండ రాళ్లు బయటపడడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, ఆర్ అండ్ బి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవచూపి రింగ్ సర్కిల్ చిన్నదిగా ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.