8 July, 2026 | 2:02 AM

నకిలీ వైద్యసేవలపై పోలీసుల కొరడా..

08-07-2026 12:00 AM
  1. అనుమతులు లేని క్లినిక్ సీజ్
  2. ఆర్‌ఎంపీ వైద్యుడి అరెస్టు
  3. వైద్యపరికరాలు, మందులు స్వాధీనం

నాగోల్, జూలై 7 (విజయక్రాంతి): ప్రజలకు ఎలాం టి చట్టబద్ధమై న అనుమతు లు లేకుండా వైద్యసేవలు అందిస్తున్న వ్యక్తిపై నాగోల్ పోలీసులు చర్యలు చేపట్టారు. అజయ్నగర్లో నిర్వహిస్తు న్న ‘సాయి సాత్విక్ క్లినిక్‘పై దాడి నిర్వహించి, క్లినిక్ నిర్వాహకుడు అకుల కిషోర్ కుమార్ (44)ను అరెస్టు చేశారు.

పోలీసులకు అం దిన విశ్వసనీయ సమాచారం మేరకు క్లినిక్లో తనిఖీలు నిర్వహించగా, వైద్య చికిత్స అందించేందుకు లేదా మెడికల్ షాప్ నిర్వహిం చేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేవని తేలింది. అయినప్పటికీ రోగుల కు చికిత్స అందిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో స్టెతస్కోప్, బీపీ యంత్రం, థర్మామీటర్లు, సిరంజీలు, ఇంజెక్షన్లు, ప్రిస్క్రిప్షన్ బుక్, ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని నాగోల్ పోలీసులు స్పష్టం చేశారు.