8 July, 2026 | 2:00 AM

చేసిన పని పదిలంగా ఉంటుంది

08-07-2026 12:00 AM

కల్వ భాస్కర్‌ను అభినందించిన డీపీఆర్‌ఓ శ్రీనివాస్ 

మహబూబ్ నగర్ జూలై 7: ప్రజలకు చేసిన సేవ పదిలంగా ఉంటుందని డిపిఆర్‌ఓ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ ఎస్.బి. ఐ. బ్రాంచ్ మేనేజర్ కల్వ భాస్కర్ హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.  మంగళవారం  బదిలీ పై వెళుతున్న కల్వ భాస్కర్ ను జిల్లా అధికారులు సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికి శుభాకాంక్షలు  తెలిపారు. జిల్లాలో జూన్ 2022 నుండి జూన్ 2025 వరకు లీడ్ బ్యాంక్ మేనేజర్ గా పని చేశారు.

బ్యాంకులు,ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరులో తన దైన శైలిలో మంచి సేవలు అందించి అధికారుల మన్ననలు పొందారని వారు పేర్కొన్నారు.  సన్మానించిన వారిలో సమాచార శాఖ,సహాయ సంచాలకులు పి.శ్రీనివాస్,జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.రవీందర్,జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ ,తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు.