ఆడబిడ్డలకు అమ్మ.. ఆశ కార్యకర్త
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ జూలై 7: ప్రతి ఆడబిడ్డకు అమ్మలా ఆశ కార్యకర్త పరితపిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగ ణంలో ఆశా కార్యకర్తల కోసం నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.
ఎస్డీఎఫ్ మూడా నిధుల నుంచి రూ.30 లక్షల వ్య యంతో ఈ విశ్రాంతి నిలయం నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి తల్లి గర్భం దాల్చిన క్షణం నుండి శిశువు సురక్షితంగా ఇంటికి చేరే వరకు ఆశా కార్యకర్తలు ఎంతో బాధ్యతతో తమ సేవలు అందిస్తారని అన్నారు. తమకు కేటాయించిన ప్రజలతో ఆత్మీయంగా మమేకమై మానవతా దృక్పథంతో ప నిచేస్తున్నారు. గతంలో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది కొంతమంది ఆశా కార్యకర్తలను ఆసుపత్రిలో ఉండనీయకుండా అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.
వారు చేస్తున్న సేవలకు తగిన గౌరవం దక్కాలని, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఈ విశ్రాంతి నిలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన నవజాత శిశువుల తల్లులకు ఈ సందర్భంగా యెన్నం హెల్త్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ శామూల్, రాఘవేందర్, సాదుల్లా కార్పొరేటర్లు సల్మాన్, తాహెర్, విట్టల్ రెడ్డి, షబ్బీర్, కిషన్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






