27-10-2025 08:39:54 PM
చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామంలో పోలీసు కళాబృందంచే ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కళాబృందం ఆటపాట కార్యక్రమంలో మిషన్ త్రిబుల్ ఆర్ లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు, బాధ్యతల గురించి మిషన్ పరివర్తన, గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలన వాటి వల్ల కలిగే అనర్ధాలను తెలియజేశారు.
సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణా, బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్న మోసాలు మొదలగు అంశాలపై ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్, ఏఎస్ఐ ఏ. వెంకటయ్య, సత్యనారాయణ, పిహెచ్సీ డాక్టర్, గ్రామంలోని ఆటో డ్రైవర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.