calender_icon.png 27 October, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదామును తలపించేలా అక్రమ రేషన్ బియ్యం నిల్వలు

27-10-2025 08:33:18 PM

పోలీసుల, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై యాలాల పోలీసులు, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడిలో సంయుక్తంగా చేసిన రైడ్ లో దాదాపు 300 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి బాణాపూర్ తండాకు చెందిన మహేష్ అనే వ్యక్తి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోదామును తలపించేలా భారీ ఎత్తున క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం ఎలా పోగు చేశాడో... ఎలా రవాణా చేశాడో... ఎలా స్థావరానికి చేర్చాడో.. అంటూ స్థానికులు అధికారుల పనితీరుపై నోరెళ్ళ పెడుతున్నారు.