16 April, 2026 | 9:21 AM

తప్పిపోయిన బాలికను అప్పగించిన పోలీసులు

07-06-2025 05:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్(Nirmal Rural Police Station) పరిధిలోని మంజులాపూర్ గ్రామంలో ఐదు సంవత్సరాల గుళ్ళే తనుశ్రీ అనే చిన్నారి తప్పిపోయి రోడ్డుపై ఉండగా, వెంటనే స్పందించిన నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ చిన్నారి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించడం జరిగింది. బాలిక రోడ్డుపై ఏడుస్తూ ఉండడంతో ఆనుగులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇట్టి విషయంలో మానవతా దృక్పథంతో త్వరితగతిన స్పందించిన నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి, ఏఎస్ఐ బాబారావు, మహిళా కానిస్టేబుల్స్ లక్ష్మీ, పరిమళను జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఐపీఎస్ ప్రశంసించారు.