వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
31-05-2026 04:41 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా, బస్టాండ్, పూసల రోడ్డుతో పాటు పలుచోట్ల ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు సంబంధించి పేపర్స్ లేని వారిని గుర్తించి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సై లు చంద్రకుమార్, అశోక్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.






