31 May, 2026 | 5:24 PM

అరుణాచలంకు ఆర్టీసీ సర్వీస్

31-05-2026 04:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజీఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో జూన్ 5 వ తేదీ రోజు మన నిర్మల్ బస్టాండ్ నుండి అరుణాచలం, రామేశ్వర్సం సూపర్ లగ్జరి యాత్ర బస్సు వెళ్తున్నట్లు డిపోమేనేజర్ పండరీ తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి మ!!  ఒంటి గం!! కు బయలుదేరి కానిపాకం, అరుణాచలం,  శ్రీరంగం, పలని,  పాతాళషెంబు, మధురై, రామేశ్వరం వెళ్లి తిరిగి 10వ తేదీ రోజు నిర్మల్ తిరిగి వస్తుందని, ఛార్జి ఒకరికి పోను రాను కలిపి 7500/- ఉంటుందని ఆయన తెలిపారు. తక్కువ సీట్లు మిగిలి ఉన్నాయి. ఆసక్తి కలవారు ఫోన్ ద్వారా అయితే tgsrtcbus.in ద్వారా కాని లేదా మన నిర్మల్ బస్టాండ్ కౌంటర్ లో కాని ముందుగా బుక్ చేసుకోవాలని మరిన్ని వివరాలకు 9959226003, 7382842582లో సంప్రదించాలని ఆయన తెలిపారు.