18 May, 2026 | 10:19 AM

సామాజిక సేవలోనూ పోలీస్ ముందంజ

20-06-2024 12:53 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జూన్ 18(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు ముందంజలో ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకతంలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నామని అన్నారు. నేర నియంత్రణకు సీసీ కెమరాల ఆవశ్యకత ఉన్నదని, దాతలు ముందుకొచ్చి ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.