కేంద్రం ఎప్పుడైనా కూలిపోవచ్చు
20-06-2024 12:53 AM
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం ఎక్కువ కాలం నిలవదని, ఎప్పుడైనా కూలిపోవచ్చని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ దయా దాక్షిణ్యా లతో నడుస్తోందని, వారికి ఎప్పుడు కోపం వచ్చిన మోదీ సర్కార్ కూలిపోతుందన్నారు. ఇండియా కూట మి అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని జోష్యం చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ 400 సీట్లు వస్తాయని మోదీ చెప్పారని, ఇప్పుడు 240 సీట్లకే పరిమితమైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని మల్లు రవి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదల విశ్వాసాన్ని కోల్పోయిందని శివసేనారెడ్డి అన్నారు.






