19 July, 2026 | 2:10 AM

ట్రాఫిక్ తగ్గించేందుకు పోలీసుల చర్యలు

19-07-2026 12:00 AM
  1. అందుబాటులోకి 30 కొత్త ట్రాఫిక్ పెట్రోల్ బైకులు
  2. ఆర్థిక సహాయం అందించిన కార్పొరేట్ సంస్థలు
  3. కఠినంగా నిబంధనల అమలు : సీపీ సజ్జనార్

బంజారాహిల్స్, జూలై 18 (విజయక్రాంతి): నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న చర్యలను చేపడుతున్నారు. అందులో భాగంగా శనివారం 30 కొత్త ట్రాఫిక్ పెట్రోల్ బైకులను ప్రారంభించారు. ట్రాఫిక్ మార్షల్స్‌కు వాటిని అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 45 కార్పొరేట్ సంస్థలు ఈ బైకులను ట్రాఫిక్ విభాగానికి సమకూర్చాయని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవానికి హాజరైన సీపీ సజ్జనార్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను సత్కరించి వారిని అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బం దులను తొలగించడంతో పాటు అత్యవసర సేవలను అందించడానికి ట్రాఫిక్ పెట్రోల్ బైకులు దోహదపడతాయన్నారు.

అంతేకాకుండా వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లపై వాహనాలు మొరాయించినా, ప్రమాదాలు జరిగి నా ఈ మొబైల్ విభాగాలు వెంటనే రంగంలోకి దిగి క్లియర్ చేస్తాయని చెప్పారు. సైర న్లు అమర్చిన ఈ వాహనాల్లోని సిబ్బంది అక్రమ పార్కింగ్, తోపుడు బండ్లను తొలగించి,అంతర్గత రహదారులలోని ట్రాఫిక్ జామ్లను క్రమబద్ధీకరిస్తారని వివరించారు.

ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించడానికి హెచ్సీఎస్సీ ద్వారా గత ఆరు నెలల్లో 120 మంది ట్రాఫిక్ మార్షల్స్ను నియమించామని వెల్లడించారు. మహిళలు, యువతు ల తక్షణ రక్షణ కోసం రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన ’స్పందన’ వాహనాలను సీపీ ప్రస్తా వించారు.

పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే ఈ వాహనాలు ప్రస్తుతం 10 అందుబాటులో ఉన్నాయన్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) నమూనాలో నడుస్తున్న హెచ్సీఎస్సీ మూడేళ్లుగా ప్రజలు, పోలీసులు, పరిపాలనా విభాగాన్ని అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తోం దన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్,ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే,అవినాశ్ కుమార్, కాజల్, హెచ్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఫోరం కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి ఇతర ట్రాఫిక్ ఉన్నతాధికా రులు తదితరులు పాల్గొన్నారు.