19 July, 2026 | 2:11 AM

సైబరాబాద్‌లో షీటీమ్స్ దూకుడు

19-07-2026 12:00 AM

డెకాయ్ ఆపరేషన్‌లో 190 పిల్లల రక్షణ 

శేరిలింగంపల్లి, జూలై 18 (విజయక్రాంతి): మహిళలు, పిల్లల సురక్షకు కట్టుబ డిన సైబరాబాద్ షీ టీమ్స్, యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఎహెచ్టియు) బృందాలు మరోసారి సత్తా చాటాయి. జూలై 10 నుంచి 17 వరకు ఒక్క వారంలోనే 127 డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి, అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్న 20 మందిని రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లలో 31 మైనర్ కేసులు నమోదు చేసిన షీ టీమ్స్, మిగిలిన వారికి సలహా, కౌన్సెలింగ్ అందించి సరైన మార్గం చూపించాయి.

మహిళల నుంచి మొత్తం 32 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్ మస్కాన్లో భారీ విజయం సాధించారు, పిల్లల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎహెచ్టియు బృందం ఆపరేషన్ మస్కాన్ ద్వారా 35 జువెనైల్ జస్టిస్ బాల కార్మిక సంబంధిత కేసులు నమోదు చేసింది. ఈ ఆపరేషన్లో 190 మంది పిల్లలను వివిధ ప్రమాదాల నుంచి రక్షించారు. వీరిలో 185 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారు.

అంతేకాకుండా, కుటుంబ సలహా కేంద్రాల సహకారంతో 33 కుటుంబాల మధ్య సమస్యలు పరిష్కరించి, సఖ్యత వాతావరణం కల్పించారు. ఈ వారం సైబరాబాద్ షీ టీమ్స్తోపాటు ఎహెచ్టియు బృందాలు మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవ స్థ, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలపై ప్రజ ల్లో వ్యక్తిగత స్థాయిలో అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమాల ద్వారా 4503 మంది ప్రజలకు చేరువైనట్లు అధికారులు వెల్లడించారు.

మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్లో తక్షణ సహాయం కోసం మహిళా హెల్ప్‌లైన్-181, చైల్ హెల్ప్ లైన్-1098, డయల్- 100 వంటి సేవలను ప్రజల కు వివరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో షీటీమ్స్ ఎహెచ్‌టీయు బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, సమాజంలో మహిళలు, పిల్లలు భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.