calender_icon.png 21 January, 2026 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాసలీలల పోలీస్ అధికారిపై వేటు

21-01-2026 12:18:46 AM

బెంగళూరు, జనవరి 20 : కార్యాలయంలో రాసలీలలు జరిపిన వీడియో వైరల్ కావడంతో డీజీపీ స్థాయి అధికారి కే రామచందర్‌రావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. మంగళవారం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.

రామచందర్‌రావు ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ప్రభుత్వానికీ ఇబ్బందిగా మారిందని.. ఈ క్రమంలోనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచందర్ రావు హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించింది. కాగా.. ఈ ఉదంతం మీ ద స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. సదరు పోలీస్ అధికారిపై తక్ష ణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.