నేడు బైంసాలో పోలీసుల ప్రజావాణి
02-07-2025 01:23 AM
భైంసా, జూలై 1(విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహించి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం బైంసాలో బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీస్ క్యాం పు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజ ల నుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.




