02-07-2025 01:24:48 AM
ఆదిలాబాద్, జూలై 1 (విజయ క్రాంతి): బీజేపీ జాతీ య మండలి సభ్యులు గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఏకగ్రీవంగా నియమించారు. మంగళవారం ఆయన నియామకం పై ప్రకటన వేలువడంతో పార్టీ నేతలు హ ర్షం వ్యక్తం చేశారు.
పార్టీ జాతీయ మండలి సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేస్తూ తనపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి గుర్తింపు ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే జాతీయ మండలి సభ్యులుగా నియామకం కావడంతో స్థానికంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కు అభినందనలు తెలియచేశారు.