4 July, 2026 | 5:32 PM

పారదర్శకత.. నమ్మకమే పోలీస్ ప్రజా భరోసా సిద్ధాంతం

23-07-2025 10:54 PM

ఎస్ఐ గోపికృష్ణ..

పెన్ పహాడ్: కుల, మత, వర్గ వివక్ష, అవినీతి దుర్వినియోగం విషయంలో పారదర్శకత ఉంటేనే పోలీసులపై నమ్మకం కలుగుతుందని అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉన్నత అధికారులు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం తీసుకొచ్చిందని ఎస్ఐ గోపికృష్ణ(SI Gopikrishna) అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజిపురం ఆదర్శ పాఠశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయడానికి విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టంతో చదవి తమ ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఎస్సై విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తే తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల చదువులు ప్రభావితం అవుతున్నాయని ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని పొందాలి, చెడు అలవాటు పడవద్దని సూచించారు. విద్యార్థులతో కలిసి ఎస్సై సహఫంక్తి భోజనం చేశారు.