15-08-2025 12:46:34 AM
కామారెడ్డి, ఆగస్టు 14 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ద్వారా154 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ సాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్‌ఎస్‌ఐ, 12 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 7 రోజులలో 154 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఈ టీం 781 ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్‌ఐ బాలరాజు గారిని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంబంధించిన వివరాలు చూపించి తీసుకెళ్లాలని ఎస్పి కోరారు.