15-08-2025 12:45:41 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీంఆసిఫాబాద్,ఆగస్టు 14(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజ ల అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్, ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబా ద్ మండలం మాలన్ గొంది గ్రామానికి వెళ్లే రహదారి వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసు కోవాలని తెలిపారు.రాబోయే మూడు రోజు లు భారీ వర్షాలు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. వ్యవసాయదారులు, కూలీలు, పశువుల కాపరులు భారీ వర్షాలు కురిసినప్పుడు చేను పనులకు, పశువులను మేపేందుకు వెళ్లకూడదని తెలిపారు.
వంతెనలు, వాగులు, కాజ్ వేల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు అటువైపు వెళ్ళకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరద ప్రభా విత, లోతట్టు ప్రాంతాలలో ప్రజల రక్షణ కొరకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచా యతీరాజ్ ఈ. ఈ. అజ్మీర కృష్ణ, తహసిల్దార్ రియాజ్ అలీ, అధికారులు పాల్గొన్నారు.